పిల్లలపై అసభ్యంగా టీచర్: దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
ఖమ్మం: పిల్లలకు సత్ప్రవర్తనను నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే అత్యంత నీచంగా ప్రవర్తించిన సంఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఐదో తరగతి విద్యార్తినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తెల్దార్‌పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం చేటు చేసుకుంది.
పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గడిపూడి వీరయ్య చౌదరి గత కొంత కాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన ఓ బాలిక పాఠశాలకు వెళ్లనని మొరాయించడంతో సంఘటన వెలుగు చూసింది.

పాఠశాలకు వెళ్లనని మొండికేసిన బాలికను తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో బాలిక అసలు విషయం చెప్పింది. ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు గ్రామస్థులతో కలిసి పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
పాఠశాలకు చెందిన ఇతర విద్యార్థినులతో కూడా గతంలో ఇలాంటి చేష్టలకు ఆ ఉపాధ్యాయుడు పాల్పడ్డాడని గ్రామస్థులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications