తెలంగాణ పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలతోపాటు పదో తరగతి పరీక్ష ఫలితాలను కూడా విద్యాశాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు.
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 80.59 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం 71,695 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టగా, 66,732 మంది హాజరయ్యారు. ఇందులో 53,777 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాల్లో బాలికలు 83.50 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 78.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 99.47 శాతం ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, 53.69 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరిస్థానంలో నిలిచింది.
ఫలితాలను www.bsc.telangana.gov.in , www.resuits.bsetelangana.org, https://tsbie.cgg.gov.in తదితర సైట్లలో వీక్షించవచ్చు.

ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు రాకపోతే.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లేదు. ఇలాంటి వారి కోసమే అధికారులు జోసా కౌన్సెలింగ్ రూపంలో ఒక అవకాశం కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్, ప్లస్ టూ పరీక్షల్లో ఉత్తీర్ణులై.. 75 శాతంలోపు మార్కులు వచ్చినవారు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మార్కులు పెంచుకుంటే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు సంపాదించవచ్చు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వరకు జరిగాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5 నుంచి 9 వరకు నిర్వహించారు. మరోవైపు, జూన్ 14 నుంచి జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70వేల మంది విద్యార్థులు రాశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications