తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బాన్సువాడ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఒకటి. ఇది కామారెడ్డి జిల్లాలో ఉంది. అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. జహీరాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి 23,930 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుపై గెలుపొందారు. పోచారంకు 65,868 ఓట్లు రాగా, బాలరాజుకు 41,938 ఓట్లు వచ్చాయి. 1983 వరకు ఇక్కడి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), ఇండిపెండెంట్ గెలుస్తూ వచ్చారు. 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలవగా, 2009లో మళ్లీ టీడీపీ గెలిచింది. 2011 ఉప ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున గెలిచారు. 2014లోను టీఆర్ఎస్ తరఫున పోచారం గెలిచారు. 2009లో, 1999లో, 1994లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు.

Telangana Assembly Elections 2018: Key Facts About Banswada Constituency
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+