తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఖరారు చేసింది. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

telangana assembly elections: ec declares 49 vote counting centers in the state

ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు:

శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం- 33 జిల్లాల్లో 49 కేంద్రాలు ఖరారు

01. జిల్లా: ఆసిఫాబాద్:
నియోజకవర్గం: సిర్పూర్
ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్

02. మంచిర్యాల:
చెన్నూరు-బెల్లంపల్లి-మంచిర్యాల
అజీజియా ఇంజనీరింగ్ కళాశాల, మంచిర్యాల

03. ఆదిలాబాద్: ఆదిలాబాద్, బోథ్
టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్, ఆదిలాబాద్

04. నిర్మల్:
ఖానాపూర్, నిర్మల్, ముథోల్
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్

05. నిజామాబాద్:
ఆర్మూర్, బాన్స్ వాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్, నిజామాబాద్

06. నిజామాబాద్:
బోధన్
ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, నిజామాబాద్

07. కామారెడ్డి:
జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి
ఏఎంసీ గోడౌన్, కామారెడ్డి

08. జగిత్యాల:
కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి
వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, జగిత్యాల

09. పెద్దపల్లి:
రామగుండం, మంథని, పెద్దపల్లి
జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, మంథని

10. కరీంనగర్:
కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్
ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల

11. సిరిసిల్ల:
వేములవాడ, సిరిసిల్ల
ఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, సిరిసిల్ల

12. సంగారెడ్డి:
నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరు
గీతం యూనివర్సిటీ

13. మెదక్:
మెదక్, నర్సాపూర్
వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హవేలీఘనపూర్

14. సిద్దిపేట:
హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్
ఇందూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్దిపేట

15. రంగారెడ్డి:
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి
సి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల, ఇబ్రహీంపట్నం

16. రంగారెడ్డి:
ఎల్బీనగర్
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం

17. రంగారెడ్డి:
రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్
లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్

18. రంగారెడ్డి:
శేరిలింగంపల్లి
బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి

19. వికారాబాద్:
పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్
ఏఎంసీ గోడౌన్, పరిగి

20. మేడ్చల్ మల్కాజ్ గిరి:
మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్
హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల, కీసర

21. హైదరాబాద్:
ముషీరాబాద్
ఏవీ కళాశాల, దోమల్ గూడ

22. హైదరాబాద్:
మలక్ పేట
ఇండోర్ స్టేడియం, అంబర్ పేట

23. హైదరాబాద్:
అంబర్ పేట:
రెడ్డి ఉమెన్స్ కళాశాల, నారాయణగూడ

24. హైదరాబాద్:
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ

25. హైదరాబాద్:
సనత్ నగర్
కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్, ఓయూ

26. హైదరాబాద్:
నాంపల్లి
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్

27. హైదరాబాద్:
కార్వాన్
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్

28. హైదరాబాద్:
గోషామహల్
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి

29. హైదరాబాద్:
చార్మినార్
కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లి

30. హైదరాబాద్:
చాంద్రాయణగుట్ట
నిజాం కళాశాల, బషీర్ బాగ్

31. హైదరాబాద్:
యాకత్ పురా
సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయ, నాంపల్లి

32. హైదరాబాద్:
బహదూర్ పురా
అరోరా కళాశాల, బండ్లగూడ

33. హైదరాబాద్
సికింద్రాబాద్
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ

34. హైదరాబాద్
కంటోన్మెంట్
వెస్లీ కళాశాల, సికింద్రాబాద్

35. నారాయణపేట:
నారాయణపేట, మక్తల్
శ్రీదత్త బృందావన్ ఇనిస్టిట్యూట్, సింగారం

36. మహబూబ్ నగర్:
మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర
జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, మహబూబ్ నగర్

37. నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్
ఏఎంసీ గోడౌన్, నాగర్ కర్నూల్

38. వనపర్తి:
వనపర్తి
ఏఎంసీ గోడౌన్, చిట్యాల

39. జోగులాంబ గద్వాల:
గద్వాల, అలంపూర్
ప్రభుత్వ పాలిటెక్నిక్, గద్వాల

40. నల్గొండ:
దేవరకొండ, నాగార్జున్ సాగర్, మిర్యాలగూడ, నల్గొండ, మునుగోడు, నకిరేకల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్స్, దుప్పలపల్లి

41. సూర్యాపేట:
హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగుతుర్తి
ఏఎంసీ గోడౌన్, సూర్యాపేట

42. యాదాద్రి భువనగిరి:
భువనగిరి, ఆలేరు ఆరోరా అకాడమీ, రాయిగిరి

43 జనగాం:
జనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి
విద్యాభారతి ఇనిస్టిట్యూట్, పెంబర్తి

44. మహబూబాబాద్:
డోర్నకల్, మహబూబాబాద్
ఎస్సీ బాలికల గురుకుల కళాశాల, మహబూబాబాద్

45. వరంగల్:
నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట
ఏఎంసీ గోడౌన్, ఎనుమాముల

46. జయ శంకర భూపాలపల్లి:
భూపాలపల్లి
సీఈఆర్ క్లబ్, భూపాలపల్లి

47. ములుగు:
ములుగు
జిల్లా కలెక్టర్ కార్యాలయం, ములుగు

48. భద్రాద్రి కొత్తగూడెం:
పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం
అనుబోస్ ఇనిస్టిట్యూట్, పాల్వంచ

49. ఖమ్మం:
ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి
శ్రీచైతన్య కళాశాల, పొన్నేకల్.

కాగా, నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+