Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా బీజేపీ రూటు మారుతుందా? కింకర్తవ్యం!!

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మూడవసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బి ఆర్ ఎస్ దూకుడుగా ముందుకు వెళుతుంది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని ప్లాన్ చేసుకున్న బీజేపీ మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బాలారిష్టాలు వచ్చిపడుతున్నాయి. ఒకటి వదిలితే మరొకటి అన్నట్టు బీజేపీని ఇటీవల కాలంలో సమస్యలు వేధిస్తున్నాయి.

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో దూకుడుగా అడుగులు వేసిన బిజెపి ఏకతాటి మీద నడుస్తున్నట్టు కనిపించింది. క్రమంగా బిజెపిలో వర్గ పోరు, అంతర్గత కలహాలు పెరుగుతున్నట్లుగా అనేక వార్తలు రావడంతో, అందుకు తగ్గట్టు బిజెపిలో ఉన్న నాయకులు కూడా చేస్తున్న వ్యాఖ్యలతో బిజెపి అసలు లక్ష్యాన్ని వదిలి పార్టీ దిద్దుబాటుపై ఫోకస్ పెట్టాల్సి వస్తోంది.

Telangana BJP

ఇక ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు జరుగుతాయని భావిస్తే, అవి జరగకపోగా, బీజేపీలో ఉన్న నాయకులు ఇతర పార్టీలకు పెడతారన్న ప్రచారం కూడా బిజెపికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడం, అంతర్గతంగా పార్టీ నేతల మధ్య సఖ్యత కోసం పని చేయడం ప్రస్తుతం బీజేపీ ప్రధాన కర్తవ్యంగా మారింది.

ఒకపక్క బీఆర్ఎస్ పార్టీ లోనూ జిల్లాలలో నేతల మధ్య సమన్వయం లేకపోయినా, సీఎం కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా ప్రతి జిల్లాలోనూ పార్టీని ముందుకు నడిపించడానికి పని చేస్తున్నారు. ఉమ్మడి అజెండాతో అన్ని జిల్లాల్లోనూ కార్యాచరణ ఇచ్చి అమలయ్యేలా చేస్తున్నారు. అన్ని విషయాల లోనూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుంటే, బిజెపి గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటుంది.

బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, కెసిఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ప్రజల మద్దతుతో అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ, ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై గట్టిగా పోరాటం చేయలేకపోతోంది. అందుకు కారణం సొంత పార్టీలోని నేతలపైనే పార్టీ మారతారని రకరకాల ఊహాగానాలు ప్రచారం కావడం.

Telangana BJP

ఈ క్రమంలో బిజెపి అసలు లక్ష్యాన్ని విడిచిపెట్టి, సంస్థాగతంగా బలోపేతం కావడానికి, సమైక్యం గా పని చేయడానికి ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే బిజెపి రూటు మారిందని ప్రజలలో జోరుగా చర్చ జరుగుతోంది. నిజంగానే బీజేపీలో ఉన్న అంతర్గత కలహాలు ఇందుకు కారణమా? లేక బీజేపీపై ప్రజలలో విశ్వాసం తగ్గించడం కోసం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారమా? అన్నది కూడా ఆలోచించవలసిన అంశమే.

ఏది ఏమైనప్పటికీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బిజెపి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ అధినాయకత్వం పదే పదే చెబుతోంది. బీజేపీ శ్రేణులు కూడా అదే భావిస్తున్నారు. ఆధిపత్య పోరు, ఇగోలు పక్కనపెట్టి బీజేపీ నేతలంతా కలిసికట్టుగా పని చెయ్యాలని భావిస్తున్నారు. మరి తెలంగాణ బీజేపీ నేతలు ఆ పని చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+