వాషింగ్ మిషిన్లు, స్మార్ట్‌ఫోన్లు ఫ్రీ: తెలంగాణ బీఎస్పీ మేనిఫెస్టో విడుదల, కీలక అంశాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహుజన సమాజ్‌వాదీ పార్టీ (BSP) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ పది లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) వెల్లడించారు.

బీఎస్పీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు:

చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషిన్లు
మహిళలకు స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ శిక్షణ
అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణ

Telangana BSP Manifesto released by RS Praveen Kumar

ధరణి పోర్టల్ రద్దు
దొడ్డి కొమురయ్య భూమి హక్కు పథకం
భూమిలేని ప్రతీ పేద కుటుంబానికి ఎకరం భూమి
ఇల్లు కట్టుకునేవారికి రూ. 6 లక్షల సాయం
ఇంటి పునర్నిర్మాణనానికి రూ. 1.50 లక్షల సాయం
ప్రతి పంటకు మద్దతు ధర
రైతులకు పంట వేసినప్పటి నుంచి అమ్మకం వరకు ప్రభుత్వ రాయితీ

ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ
ఏటా రూ. 25 వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్
భీం రక్షా కేంద్రాలు కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం
పూలే విద్యా దీవెన
ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు
ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య
డేటా ఏఐ, కోడింగ్ లో విద్యార్థులకు శిక్షణ

షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు
బ్లూ జాబ్ కార్డు పథకం
గ్రామాలు, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ
రోజు కూలీ రూ. 350కు పెంపు
ఉపాధి కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్యం, జీవిత బీమా
షేక్ బందగీ గృహ భరోసా

వలస కార్మికుల సంక్షేమ నిధి
రూ. 5వేల కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డ్
వలస కార్మికులకు వసతి
గిగ్ కార్మికులు, లారీ టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+