Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana budget 2022: భవన నిర్మాణ కార్మికులకు, నేతన్నలకు, కల్లుగీత కార్మికులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మంత్రి హరీష్ రావు 2022- 23 సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,56,958. 51 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే మానవీయ కోణంలో బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్న హరీష్ రావు వివిధ వర్గాల వారికి లబ్ది చేకూరేలా పథకాలను అందిస్తున్నట్టు ప్రకటించారు.

Recommended Video

    Telangana Budget 2022 Highlights | Oneindia Telugu
    భవన నిర్మాణ రంగ కార్మికులకు మోటార్ సైకిళ్ళు

    భవన నిర్మాణ రంగ కార్మికులకు మోటార్ సైకిళ్ళు


    భవన నిర్మాణ కార్మికుల కోసం బడ్జెట్లో గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగ కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారి కోసం సరికొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తన బడ్జెట్ ప్రసంగంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్లను అందజేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించినట్లుగా హరీష్ రావు పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మొదటి విడతలో భాగంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్ష మందికి సబ్సిడీపై మోటార్ సైకిళ్లను అందజేయనున్నట్టు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

    పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంపు, గీత కార్మికులకు ప్రత్యేక పథకం

    పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంపు, గీత కార్మికులకు ప్రత్యేక పథకం


    ఇక ఇదే సమయంలో పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, పారిశుద్ధ్య కార్మికులకు ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని, కెసిఆర్ నిర్ణయించినట్లుగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు . ఇక కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

    నేతన్నలకు భీమా పథకం, విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్

    నేతన్నలకు భీమా పథకం, విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్

    రైతు బంధు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతు భీమా మాదిరిగా నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలని, అందు కోసం ఐదు లక్షల రూపాయల భీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఏడవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+