తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: శాఖలవారీ కేటాయింపులు ఇలా: ఫ్రీ కరెంట్, ఫ్రీ సిలిండర్లకు ఇంతే
Telangana Budget 2024: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ బడ్జెట్‌లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. ఇక మూల ధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా భట్టి విక్రమార్క ప్రతిపాదించారు.

శాఖలవారీగాచూసుకుంటే- ఉద్యానవనాలు- రూ.737 కోట్లు, రోడ్లు భవనాలు- రూ.5,790 కోట్లు, హోం శాఖ- రూ.9,564 కోట్లు, పశుసంవర్ధక శాఖ- 1,980 కోట్లు, విద్యా శాఖకు రూ. 21,292 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, ప్రజాపంపిణీ- రూ.3,836 కోట్ల రూపాయలను కేటాయించారు.
గృహజ్యోతి- రూ.2,418 కోట్లు, పరిశ్రమల శాఖ- రూ.2,762 కోట్లు, ఐటీ శాఖ- రూ.774 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు, అడవులు- పర్యావరణ శాఖ- రూ.1,064 కోట్లు, ట్రాన్స్‌కో, డిస్కం- రూ.16,410 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ- రూ.11,468 కోట్లను ఇచ్చారు.
బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు, మైనారిటీ శాఖ- రూ.3,003 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ- రూ.2,736 కోట్లు, రీజినల్ రింగ్‌రోడ్- రూ.1,525 కోట్లు, ఎస్సీ సంక్షేమం- రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమం- రూ.17,056 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లను కేటాయించారు.












Click it and Unblock the Notifications