వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనన్న రేవంత్ రెడ్డి.. సభా వ్యూహంపై ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో చర్చించారు.

అర్హత లేకున్నా పదవుల్లో అధికారులు .. రేవంత్ ఫైర్

అర్హత లేకున్నా పదవుల్లో అధికారులు .. రేవంత్ ఫైర్


ఈ క్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాష్ట్ర రైతాంగ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మైనారిటీల అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా మంది అర్హత లేకున్నా కలెక్టర్లు గా పని చేస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి, ఎస్పీ లలో చాలామందికి అర్హత లేకున్నా వారు ఉన్నత పదవులలో కొనసాగుతున్నారని ఆరోపించారు. అర్హత లేకున్నా పదవిని ఇచ్చినందుకు వారంతా కెసిఆర్ కు లాయల్ గా ఉంటున్నారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సీఎస్ సోమేశ్ కుమార్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్

సీఎస్ సోమేశ్ కుమార్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్


ఐదుగురు అధికారుల చేతుల్లో నలభై శాఖలు ఉన్నాయని, అధికారుల అండతో సీఎం వేల కోట్లు కొల్లగొడుతున్నారని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్ దగ్గర 8 శాఖలు ఉన్నాయని, సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన అధికారి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సుల్తానియా దగ్గర ఆరు శాఖలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రాంత అధికారులను కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అధికారులను అర్హత లేకున్నా అందలం ఎక్కిస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్ట్ కు మెట్రోపై కాంగ్రెస్ ప్రశ్నాస్త్రాలు

గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్ట్ కు మెట్రోపై కాంగ్రెస్ ప్రశ్నాస్త్రాలు


కలెక్టర్లుగా ఎంత మందికి అర్హత ఉందో చూడాలని తాము డిమాండ్ చేయనున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని పోరాటాలు చేసినా ఫలక్ నుమా నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో వేయడం లేదని, గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్ట్ కు మెట్రో వేయడానికి కారణం ఏమిటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ఇదే అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Recommended Video

Telangana Assembly ఆవరణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు .. గ్రౌండ్ రిపోర్ట్ | Oneindia Telugu
 గవర్నర్ ప్రసంగం వివాదంపై టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్

గవర్నర్ ప్రసంగం వివాదంపై టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్

శాసనసభ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం పైన కూడా సీఎల్పీ మీటింగ్ లో చర్చ జరిపిన నేతలు దీనిపై కేసీఆర్ సర్కార్ ను నిలదీయాలని నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ సంక్షోభం అని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశం నిర్వహించడంపై అసెంబ్లీ లోనే కాదు పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై, దళిత బంధు పథకం అమలుపై, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించడంపై కూడా కాంగ్రెస్ పార్టీ సభా వేదికగా పోరాటం చేయనుంది.

English summary
Telangana PCC chief Revanth Reddy made sensational remarks against the Telangana govt. Revanth Reddy commented that this is the last budget introduced by the KCR govt in the wake of the budget meetings today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X