అసెంబ్లీలో తెలంగాణా ప్రగతి పరుగులు వివరిస్తూ గవర్నర్ ప్రసంగం.. కీలక అంశాలివే!
తెలంగాణాలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. దేశానికి దిక్సూచిగా, సమృద్ధ - పురోగామి రాష్ట్ర నిర్మాణానికి నిబద్ధతతో అందరూ కలసి ముందుకు సాగాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపు నిచ్చారు. శాసన మండలి, శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలినాడు ఈ రోజు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: గవర్నర్
రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి రైతులే ఆత్మ అని, రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. సమ్మిళితత్వం, స్వయం సమృద్ధి, సాధికారతతో కూడిన రాష్ట్రంగా ఆవిర్భవించాలన్న దార్శనికత, సాహసోపేత సంస్కరణలు, ప్రజా కేంద్రిత సుపరిపాలనతో సాకారం అవుతోందన్నారు.
ఘనమైన సంస్కృతికి తెలంగాణా నిలయం
అవకాశాలు, అభివృద్ధి, సాధికారత మెండుగా ఉన్న రాష్ట్రం రానున్న రోజుల్లో మరింత ఉజ్వలంగా, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక విజ్ఞాన, సామాజిక న్యాయం లాంటి అంశాలలో దేశంలో అగ్రగామిగా నిలవబోతోందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. ఘనమైన సంస్కృతికి తెలంగాణా నిలయం అన్నారు. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణా అడుగులు వేస్తుందని అన్నారు.

సుస్థిర రాష్ట్ర రూపకల్పనకు ప్రతీకగా బడ్జెట్
రాష్ట్రం అసాధారణ రీతిలో పరివర్తనకి దగ్గరగా ఉందన్న గవర్నర్ సుస్థిర రాష్ట్ర రూపకల్పనకు ప్రతీకగా బడ్జెట్ ను అభివర్ణించారు. రాష్ట్ర పురోగతికి రోడ్డుమ్యాప్ గా, పౌరుల ఆకాంక్షలను నెరవేర్చేదిగా పేర్కొన్నారు. అలాంటి బడ్జెట్ సమావేశాలలో సభ్యులందరూ శ్రద్ధగా పాల్గోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుత్పత్తి ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైటెక్ పరిశ్రమలలో తెలంగాణని అగ్రగామిగా చేయడం ద్వారా తన ప్రభుత్వం సుస్థిరతతో పాటు పురోగతికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
పెట్టుబడులు పెంచటానికి ప్రభుత్వ చర్యలను వివరించిన గవర్నర్
AI సిటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల సహకారంతో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి, ఉపాధి అవకాశాల్ని మెరుగుపరచడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచటానికీ చర్యలు చేపట్టినట్లు గవర్నర్ చెప్పారు. ఈ దిశగా పెట్టుబడులు పెంచటానికి ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను ఈ సందర్భంగా గవర్నర్ ఉటంకించారు.
స్వచ్ఛ హరిత ఇంధన పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
భవిష్యత్ ఇంధన డిమాండ్లను తీర్చడానికి పునరుత్పాదక రంగం, పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ లాంటి రంగాలలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. 2029- 30 నాటికి రాష్ట్రంలో 6 వేల పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా .స్వచ్ఛ హరిత ఇంధన పాలసీ నీ ఇప్పటికే ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిందని గవర్నర్ పేర్కొన్నారు.
సామాజిక న్యాయం అందించే దిశగా సర్కార్ యత్నం
హరిత ఇంధనం, డేటా సెంటర్లు, ఆహార ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్ వాహనాలు రక్షణ తయారీ వంటి రంగాలలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక న్యాయాన్ని అందించే దిశగా, ప్రభుత్వం నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా వెనుకబడిన తరగతుల కోసం 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించిందని, దీనివల్ల బీసీ కులాలకు విద్యా, ఉపాధి, పాలనలో న్యాయోచిత వాటాను లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారత
కమిషన్ సిఫార్సుల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ కోసం కూడా బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటన్న గవర్నర్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారతనివ్వటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు యువతకు సాధికారిక కల్పించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను చెప్పిన గవర్నర్
మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు 5500 కోట్ల రూపాయల మేర ప్రయాణపు ఖర్చులను మిగిల్చినట్లు, 200 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగిస్తున్న 50 లక్షల పేద కుటుంబాలకు గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా 43 లక్షల కుటుంబాలకు LPG సిలిండర్ను 500 రూపాయలకే అందిస్తూ 433 కోట్ల రూపాయల రాయితీని కల్పించినట్లు వివరించారు.
రైతులకు ఆర్ధిక భద్రతకు ప్రభుత్వ చర్యలు
వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను మహిళలు నిర్వహిస్తున్న SHGలకే ప్రత్యేకించినట్లు పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భద్రత కల్పించేలా 25 లక్షల మందికి పైగా రైతులకు పంట రుణాలను మాఫీ చేసినట్లు గుర్తు చేశారు. రైతు భరోసా పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయం 12 వేల రూపాయలకు పెంచినట్లు, అలాగే భూమిలేని వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏటా 12 వేల రూపాయల సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రజల కలలు సాకారం చేసేలా బడ్జెట్
రాష్ట్ర ప్రజల కలలు సాకారం కావడం కోసం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇక నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా తొలిరోజు సమావేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు.గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications