హోం మంత్రిగా సీతక్క, 4న కేబినెట్ విస్తరణ - కొత్త మంత్రులు వీరే..!!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరరైంది. ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించారు. ఇప్పటికే గవర్నర్ తో సీఎం రేవంత్ ఈ మేరకు చర్చలు చేసారు. మంత్రివర్గంలో ఖాళీల భర్తీ తో పాటుగా శాఖల మార్పు పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. రేపు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ తుది జాబితా పైన హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు. మంత్రివర్గంలో తీసుకొనే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
విస్తరణ ఖరారు
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఢిల్లీలో వరుసగా అయిదు రోజులు పార్టీ నాయకత్వంతో చర్చల తరువాత కూర్పు కొలిక్కి వచ్చింది. ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణ పైన గవర్నర్ కు సీఎం రేవంత్ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న హోం శాఖ సీతక్కకు కేటాయించటం దాదాపు ఖాయమైంది.

హోం మంత్రిగా సీతక్క
ఇక కేబినెట్‌లోకి దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటున్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్‌లో స్థానం దక్కుతుంది. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం ఖాయమైందని తెలుస్తోంది. ఈ పేర్ల పైన రేపు రేవంత్ ఢిల్లీ పర్యటనలో అధికారికంగా ఫైనల్ కానున్నాయి.
కొత్తగా మంత్రివర్గంలోకి
అదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా..నాలుగు భర్తీ చేసి రెండు స్థానాలు ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది. మైనార్టీ, ఎస్టీల కోసం మరో బెర్తు ఖాళీగా ఉంచనున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం లేదా బుధవారం ఉదయం సీఎం రేవంత్, భట్టి ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ తో చర్చల తరువాత కొత్త మంత్రివర్గం..అదే విధంగా టీపీసీసీకి నూతన అధ్యక్షుడి ఎంపిక పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ వర్గానికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కనుంది. దీంతో...మంత్రి పదవి ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications