రైతు రుణమాఫీపై రేవంత్ మంత్రివర్గం కీలక నిర్ణయం..!!
రైతు రుణమాఫీ అమలుకు ప్రభుత్వం సిద్దమైంది. ఎన్నికల సమయంలోనే రూ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలుకు నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రమాణం చేసారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసారు. ఈ రోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో వీటి పైన చర్చించి...రైతు రుణమాపీ పైన అధికారిక నిర్ణయాని కి ఆమోద ముద్ర వేయనున్నారు.
మంత్రివర్గ భేటీలో
తెలంగాణలో రైతు రుణమాఫీ పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రైతు రుణమాఫీకి ప్రత్యామ్నాయ మార్గాల పైన ఫోకస్ చేసారు. ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేసి ..దాని ద్వారా రైతు రుణమాఫీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కార్పోరేషన్ కు రుణం తీసుకొని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే విధంగా తిరిగి రుణ చెల్లింపు కోసం ప్రత్యేక మార్గాలను సిద్దం చేసారు. అయితే, కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్దిదారులకే అమలు చేయాలనే ప్రతిపాదన పైన నిర్ణయం కీలకం కానుంది.

అధికారుల ప్రతిపాదన
డిసెంబర్ 9, 2018 కటాఫ్ డేట్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పటి నుంచి రైతులు తీసుకున్న రూ 2 లక్షల వరకు రుణమాఫీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువగా రుణం తీసుకున్న వారి సంఖ్య ఉంటే ఏం చేయాలనే దాని పైన నేటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీ అమలు కోసం రేషన్ కార్డులు, పట్టాదార్ పుస్తకం వంటివి తప్పని సరి చేయాలని అధికారులు సూచించారు. కొన్ని నిబంధనల ద్వారా రుణమాఫీ భారం తగ్గించుకోవచ్చని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
రుణమాఫీకి ఆమోదం
అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతుల వివరాలు సేకరించారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 లోగా రెండు విడతలుగా రుణమాఫీ అమలు చేయాలనేది తాజా ఆలోచనగా తెలుస్తోంది. అయితే...మొత్తం ఎంత మంది రైతులకు అమలు అవుతుంది..ఎంత భారం పడుతుందనేది ఈ మంత్రివర్గంలో చర్చించి తుది ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. నేరుగా బ్యాంకుల్లోనే రైతు రుణ ఖాతాల్లో నగదు జమ చేయటం ద్వారా ప్రభుత్వం రుణమాఫీ చేసిందనే గుర్తుంపు దక్కుతుందని భావిస్తున్నారు. దీంతో..ఈ రోజు మంత్రివర్గంలో రుణమాఫీ అమలు పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications