తెలంగాణలోని 13 రాజకీయ పార్టీలకు బిగ్ షాక్

తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో గుర్తింపులేని 13 రాజకీయ పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత ఆరేళ్లలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ పోటీలో లేని 13 పార్టీలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది ఈసీ. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) సీ. సుదర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


తెలంగాణలోని గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) సీ. సుదర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A ప్రకారం ఈ ఆర్‌యూపీపీలు గత ఆరు ఏళ్లలో సాధారణ, శాసనసభ లేదా ఉప ఎన్నికలలో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు.

ఈ క్రమంలో ఈ 13 పార్టీలు చట్టంలో రూపొందించినట్లు వ్యవహరించకపోవడంతో ఇవి రాజకీయ పార్టీలుగా పని చేయలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది.

Telangana CEO C Sudarshan Reddy Issues Show Cause Notices to 13 Unrecognized Political Parties

షోకాజ్ నోటీసులు అందిన 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు..

1. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ

2. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ

3. జాగో పార్టీ

4. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్

5. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ

6. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం

7. యువ పార్టీ

8. బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-పూలే)

9. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ

11. జాతీయ మహిళా పార్టీ

12. యువ తెలంగాణ పార్టీ

13. తెలంగాణ ప్రజా సమితి (కిశోర్, రావు మరియు కిషన్)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+