కేసీఆర్ వ్యూహం అద్భుతహా!! ఉండ‌వ‌ల్లితో భేటీ అందుకేనా??

రాజ‌కీయ వ్యూహాల్లో గండ‌ర గండ‌డుగా పేరుతెచ్చుకున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు జాతీయ రాజ‌కీయాల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీని ఎదుర్కోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్లుగా త‌గిన వ్యూహాల‌ను ఆయ‌న రూపొందించుకుంటున్నారు. త‌న అమ్ముల‌పొదిలో ఉన్న అస్త్రాల‌ను నెమ్మ‌దిగా బ‌య‌ట‌కు తీస్తున్నారు. భారీ ప్ర‌చార ప‌టాటోపంతో ఏమీ లేక‌పోయినా అన్నీ ఉన్న‌ట్లు ప్ర‌చారం చేసుకొని ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విన‌ధిష్టించిన న‌రేంద్ర‌మోడీని, బీజేపీని సాగ‌నండ‌ప‌మే కేసీఆర్ ల‌క్ష్యంగా ఉంది. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే కేసీఆర్ త‌న బాట‌లో స‌వ్యంగానే సాగుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌వైపు మొగ్గు!

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌వైపు మొగ్గు!


తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌తీయ రాష్ట్ర‌స‌మితిగా మారుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ బాధ్య‌త‌ల‌ను పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల‌కు అప్ప‌జెప్పారు. జాతీయ‌పార్టీ కాబ‌ట్టి ఆంధ్ర‌, తెలంగాణ అంటూ విడిగా చూడాల్సిన అవ‌స‌రంలేదు. అంతా ఒక‌టే అవుతుంది. ఢిల్లీలో పార్టీ వాణి వినిపించే స‌మ‌ర్థ‌వంత‌మైన వ్య‌క్తి కోసం కొద్దిరోజులుగా కేసీఆర్ అన్వేషిస్తున్నారు. జాతీయ రాజ‌కీయాల‌పై ప‌ట్టున్న నేత‌ను పార్టీ అధికార ప్ర‌తినిధిగా నియ‌మించాల‌ని త‌లపోస్తున్నారు. ఆయ‌న అన్వేష‌ణ‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌వైపు మొగ్గుచూపారు.

 రాజ్య‌స‌భ‌కు ఉండ‌వ‌ల్లి?

రాజ్య‌స‌భ‌కు ఉండ‌వ‌ల్లి?

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ను ఢిల్లీలో అధికార ప్ర‌తినిధిగా నియ‌మించ‌డ‌మే కాకుండా రాజ్య‌సభ స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయ‌న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లిని పిలిపించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఉండ‌వ‌ల్లికి కేసీఆర్ త‌న మ‌న‌సులో మాట‌ బ‌య‌ట‌పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

 తిర‌స్క‌రించిన ఉండ‌వ‌ల్లి?

తిర‌స్క‌రించిన ఉండ‌వ‌ల్లి?

కేసీఆర్ రాజ్య‌స‌భ ఆఫ‌ర్‌ను ఉండ‌వ‌ల్లి సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి అది త‌ర్వాత చూద్దామ‌ని, జాతీయ పార్టీ న‌డ‌ప‌డం అంత సులువేం కాద‌ని ఉండ‌వ‌ల్లి సూచించారు. దాదాపు ఆయ‌న మూడుగంట‌ల‌కు పైగా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నాన‌ని, ప్ర‌స్తుతం త‌న‌కు ఏ ప‌ద‌వీ అవ‌సరం లేద‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+