దేశంలోనే టాప్ లో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి వేతనం, చంద్రబాబుకి ఎంతంటే!!
దేశంలో వివిధ రాష్ట్రాల్లో పని చేసే ముఖ్యమంత్రులకు, మంత్రులకు వేరువేరుగా వేతనాలు ఇస్తారు. ఇక అన్ని రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులకు నివాసం, వాహనం, భద్రతతో పాటు, దేశ విదేశాలలో ఎక్కడికైనా వెళ్లడానికి వెసులుబాటు కల్పిస్తారు. వీటితో పాటు మంచి జీతం కూడా ఇస్తారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ల శాలరీ ఇదే
అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా శాలరీ తీసుకుంటున్న సీఎం ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంత శాలరీ తీసుకుంటున్నారు అన్న ఆసక్తి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తుంది. ఏపీకి నాలుగో సారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు. ఇక చంద్రబాబు వేతనం విషయానికి వస్తే 335,000గా నిర్ణయించారు. చంద్రబాబుకు అదనంగా ఉండే సౌకర్యాలని కల్పిస్తున్నారు.

చంద్రబాబు కంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు కంటే ఎక్కువ వేతనాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏకంగా నాలుగు లక్షల పదివేల రూపాయల వేతనాన్ని తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న వేతనమే ఎక్కువ.
దేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు తీసుకునే వేతనాలిలా
ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న వేతనం వివరాల్లోకి వెళితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4,10,000 వేతనం తీసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానాలలో వరుసగా, ఢిల్లీ 3,90,000, ఉత్తర ప్రదేశ్ 3,65,000, మహారాష్ట్ర సీఎం 3,40,000 తీసుకుంటున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు వేతనం ఎంతంటే
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 3,35,000, గుజరాత్ ముఖ్యమంత్రి 3,21000, హిమాచల్ ప్రదేశ్ 3,10,000, హర్యానా 2,88,000, ఝార్ఖండ్ 2,55,000, మధ్యప్రదేశ్ 2,30,000 ఛత్తీస్గడ్ 2,30,000 పంజాబ్ 2,30,000, గోవాకు 2, 20,000, బీహార్ సీఎం 2,15000, తమిళనాడు 2,05,000, కర్ణాటక సీఎం 2 లక్షలు తీసుకుంటున్నారు.
అత్యల్ప వేతనం తీసుకునే త్రిపుర సీఎం
సిక్కిం సీఎం 1,90,000, కేరళ 1,85,000, ఉత్తరాఖండ్1,75,000, రాజస్థాన్ 1,75,000, ఒడిశా 1,60,000, మేఘాలయ 1,50,000, అరుణాచల్ ప్రదేశ్ 1,33,000, అస్సాం లక్ష 25000, మణిపూర్ 1,20,000, నాగాలాండ్ 1,10,000 త్రిపుర1,05,500 వేతనం తీసుకుంటున్నారు. అత్యల్పంగా వేతనం త్రిపుర సీఎం తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications