మూసీకి పునర్ వైభవం: లండన్‌లో సీఎం రేవంత్ కీలక భేటీ
లండన్: మూసీ నదికి పునర్ వైభవం వస్తే హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని లండన్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గానూ థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు.
మూసీ పరివాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.

మరోవైపు, హైదరాబాద్‌లో మూసీ, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి చెరువుల ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీకి పునర్ వైభవం వస్తే.. నది, చెరువులతో హైదరాబాద్ మరింత శక్తిమంతమవుతుందని చెప్పారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ టీమ్ పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అంతేగాక, భవిష్యత్తులో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని పేర్కొంది.
కాగా, లండన్ నగరంలోని థేమ్స్ నది తరహాలో మూసీ నదిని అభివృద్ది చేయాలని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగర సుందరీకరణతోపాటు కాలుష్యం కోరల నుంచి హైదరాబాద్‌ను బయట పడేయొచ్చని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అంతకుముందు దావోస్ పర్యటనలో దిగ్గజ కంపెనీల నుంచి తెలంగాణ రాష్ట్రం భారీగా పెట్టుబడులను ఆహ్వానించింది. అదానీ గ్రూప్, టాటా సన్స్, తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications