అల్లు అర్జున్ తో పంచాయతీకి ఫుల్ స్టాప్-కాంగ్రెస్ ఎంపీ కీలక సంకేతం..!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ చనిపోవడానికి కారకులయ్యారన్న అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలుకు పంపినా వెంటనే బెయిల్ తెచ్చేసుకున్నారన్న ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం.. ఆయనపై మరోసారి హైకోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతుందన్న చర్చ నడుస్తోంది. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.
ఈ తరుణంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఈ వివాదంపై మరోసారి స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ జాతీయ నేతల నుండి రాష్ట్ర నేతల వరకు ప్రోలాంగ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యూపీలో స్వామీజీ ప్రోగ్రాం తొక్కిసలాటలో 100 మంది చనిపోయారని, అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని గుర్తుచేశారు.

ఇండస్ట్రీలో సమస్యలు తెలుస్తాయని దిల్ రాజుకు ఫిల్మ్ డేవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ హాయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి అయిందని, ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పై,ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారన్నారు. మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవకుంటే అల్లు అర్జున్ రియల్ హీరో అయ్యేవాడన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారన్నారు.
బీజేపీ పురంధేశ్వరి దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని అంటున్నారని, బండి సంజయ్,పురంధేశ్వరి,అశ్విని వైష్ణవ్, లక్ష్మణ్ పీఎం రిలీఫ్ ఫండ్స్ నుండి కోటి రూపాయలు బాధిత కుటుంబానికి ఎందుకు ఇప్పించలేదని ఎంపీ ప్రశ్నించారు?
అల్లు అర్జున్ తప్పులేదని అంటున్నారని, మహిళ చావుకు ఎవరు కారణమని ప్రశ్నించారు. దిల్ రాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇండస్ట్రీలోనే ఉంటాడన్నారు. వివాదాలను కొనసాగించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన తన మనసులో మాట చెప్పేశారు.












Click it and Unblock the Notifications