తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసుపు కుంకుమ, తులం బంగారం గ్యారెంటీ

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

 Telangana Congress plans to announce Pasupu Kumkuma scheme for bride family

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. అభ్యర్థులకు బీఫామ్‌లను అందజేశారు.

తన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో, ఇచ్చిన హామీలకు మించిన స్థాయిలో ఉండేలా జాగ్రత్తలను తీసుకుంటోంది. కర్ణాటక తరహాలో ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. వాటిని మేనిఫెస్టోలో చేర్చాల్సి ఉంది.

మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ప్రతి కుటుంబానికీ 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటివి ఉన్నాయి.

పసుపు కుంకుమ పేరుతో వధువు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామనే హామీని మేనిఫెస్టోలో చేర్చింది తెలంగాణ కాంగ్రెస్. తాజాగా ఇదే పథకంలో మరో అంశాన్ని చేర్చడంపై కసరత్తు సాగిస్తోందా పార్టీ. లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం చొప్పున బంగారం ఇవ్వాలని ప్రతిపాదించింది.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు సారథ్యంలో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఈ హామీని పరిశీలిస్తోంది. అధికారంలోకి వస్తే- ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తోంది. వధువు కుటుంబానికి తులం బంగారం ఇచ్చే హామీని ఇంకా ఖరారు చేయలేదని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ప్రతిపాదనలపై పీసీసీ, ఏఐసీసీ ధ్రువీకరించాల్సి ఉంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+