Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్: 4వేల కోట్ల సబ్‌ప్లాన్, ప్రత్యేక డీఎస్సీ, హామీల వర్షం ఇలా

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురువారం మైనార్టీ డిక్లరేషన్ 2023(telangana congress minority declaration 2023)ని విడుదల చేసింది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా.. ఇప్పటికే యువ, రైతు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించింది కాంగ్రెస్, తాజాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మైనార్టీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా ముస్లింలకు అనేక అవకాశాలు కల్పించింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని రేవంత్ గుర్తు చేశారు.

telangana congress releases minority declaration 2023: full details

వక్ఫ్‌ భూములను కాపాడే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని రేవంత్‌ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్‌కు టికెట్ కేటాయిస్తే.. పోటీగా ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందని రేవంత్ ఆరోపించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీకి కాకుండా.. ఎంఐఎం కేసీఆర్‌కు మద్దతు ఇస్తోందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌​పై మాత్రం ఎంఐఎం పోటీ చేయదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మైనార్టీ డిక్లరేషన్​లోని ముఖ్యంశాలు:

మైనార్టీలకు ఆర్థిక ఉద్ధరణ, సాధికారత
6 నెలల్లోపు కుల గణనను చేపట్టి.. ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనార్టీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు
మైనార్టీల సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచడంతో పాటు ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్
విద్య, ఉపాధి ఈక్విటీకి నిబద్ధత
అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్ పథకం
ఎంఫిల్‌ చేసిన మైనార్టీ యువతకు రూ.5 లక్షల సాయం
పీహెచ్‌డీ, పీజీ చేసిన మైనార్టీ యువతకు రూ.లక్ష సాయం
సిక్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఏర్పాటుకు హామీ
మైనార్టీ సంస్థల్లో ఖాళీల భర్తీకి హామీ
ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
అన్ని మతాల పూజారులకు నెలకు రూ.పది నుంచి రూ.12 వేల గౌరవ వేతనం
ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి
ఇళ్లులేని మైనార్టీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం
ఇళ్లు లేని మైనార్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
మైనార్టీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం
మతపరమైన హక్కులు, సంస్కృతి రక్షణ
నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడం కోసం సంవత్సరానికి 1,000 కోట్లు
పాత బస్తీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ లాంటి కీలక హామీలున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+