తెలంగాణలో ఆ దగ్గు సిరప్ నిషేధం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తోంది కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్. ఇటీవల కోల్డ్‌ రిఫ్ సిరప్‌ కారణంగా మధ్యప్రదేశ్ లో 11 మంది చిన్నారులు మృతి చెందారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ మరణాలపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిరప్‌ లను నిషేధించారు. మధ్యప్రదేశ్‌ తో పాటు కోల్డ్ రిఫ్ కారణంగా రాజస్థాన్, తమిళనాడు, కేరళలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రాల్లో కూడా దీనిని నిషేధించారు. అయితే తాజాగా తెలంగాణలోనూ ఈ దగ్గు సిరప్ ను నిషేధించారు. ఈ మేరకు ఈ సిరప్ ను ఎవరూ వాడొద్దని ప్రజలకు తెలంగాణ డీసీఏ హెచ్చరికలు ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా శిశు మరణాలతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కోల్డ్ రిఫ్ సిరప్ ను బ్యాన్ ​ చేస్తున్నట్లు పలు రాష్ట్రాలు ప్రకటించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సిరప్ పై నిషేధం విధించింది. ఈ సిరప్​ అమ్మకాలను నిషేధించి మార్కెట్​ నుంచి తొలగించాలని ఆదేశిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సిరప్ ను ఎవరూ వాడొద్దని ప్రజలకు తెలంగాణ డీసీఏ హెచ్చరిక ఇచ్చింది.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోల్డ్ రిఫ్ సిరప్‌ పై నిషేధం విధిస్తున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కోల్డ్‌ రిఫ్ దగ్గు మందుపై నిషేధం విధించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ తీసుకోవడం కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఈ సిరప్ తాగిన కొందరు పిల్లలు మృతి చెందిన నేపథ్యంలో.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంగువర్చతిరమ్ గ్రామంలోని శ్రీసాన్ ఫార్మా.. తయారు చేసిన కోల్డ్ రిఫ్ సిరప్(పారాసిట్ మాల్, ఫినైల్ ప్రైన్, హైడ్రో క్లోరైడ్, క్లోరోఫిర్మైన్ మలీయేట్ సిరప్) బ్యాచ్ నెం. ఎస్ ఆర్-13, Mfg. Dt. మే- 2025, Exp. Dt. ఏప్రిల్- 2027 కారణంగా పిల్లల మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Cracks Down State Bans Cold Riff Syrup Amid Health Scare

కోల్డ్‌ రిఫ్ సిరప్ బ్యాచ్ నెం. SR- 13 ఉంటే.. దాన్ని వెంటనే వినియోగించడం ఆపి.. స్థానిక డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు నివేదించాలని తెలిపింది. ఈ ఔషధం ఎవరి వద్ద ఉన్నా వెంటనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ కు నేరుగా 1800- 599- 6969 టోల్ ఫ్రీ నంబర్ నుంచి తెలియజేయవచ్చు. ఈ టోల్ ఫ్రీ నంబర్ అన్ని పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+