తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు: ఎప్పుడంటే?
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. మే 25న(గురువారం) ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(హైదరాబాద్)లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేస్తారు.
ఫలితాల పాస్‌వర్డ్ సీడీని 11.15 గంటలకు విడుదల చేయనున్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి హాజరుకానున్నారు. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఇక మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా మే 25నే వెల్లడించనున్నారు. ఎంసెట్ ఫలితాల కోసం https://eamcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

కాగా, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను ఇప్పటికే విడుదల చేశారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది హాజరైన విషయం తెలిసిందే.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications