సెల్ ఫోన్ నంబర్‌తో తెలంగాణ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేయండి: లింక్ ఇదే

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.

తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత, మిజోరంలల్లో పోలింగ్ ముగిసింది.

Telangana elections 2023: Check your name and polling station through mobile phone number

నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తంగా 4,795 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 13వ తేదీన వాటి స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ పేపర్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 15.

మరోవంక కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య.. 3,26,18,205. ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. 15,406 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అలాగే- 2,944 మంది విదేశాల్లో నివసించే వారు ఉన్నారు.

యువ ఓటర్ల సంఖ్య 9,99,667గా తేలింది. వారి వయస్సు 18 నుంచి 19 మధ్యన నమోదైంది. వారిలో 90 శాతం మందికి పైగా తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నా వారే. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారి సంఖ్య 4,40,371. 9.48 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.

Telangana elections 2023: Check your name and polling station through mobile phone number

కాగా ఓటరు జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక వెసలుబాటును కల్పించింది. సెల్ ఫోన్ నంబర్‌తోనే తమ పేర్లను ఈ జాబితాలో చెక్ చేసుకోవచ్చు. అది- ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే సమయంలో ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్‌ అయివుండాలి.

దీనికి అవసరమైన లింక్.. https://electoralsearch.eci.gov.in/. ఈ లింక్‌ను క్లిక్ చేసినప్పుడు Search in Electoral Roll అనే హోమ్ పేజీ డాష్ బోర్డ్ ప్రత్యక్షమౌతుంది. దానికి కుడివైపున Search by Mobile అనే అక్షరాలు కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.

తొలుత Select your State అని క్లిక్ చేసి, తమ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. అనంతరం తమ భాషను ఎంపిక చేసుకోవాలి. కింద మొబైల్ నంబర్ అని ఉన్న చోట ఓటర్లు తమ నంబర్‌ను పొందుపర్చాలి. ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని పొందుపరిచి, క్యాప్చా కోడ్‌ను టైప్ చేసి, సెర్చ్ అని కొడితే ఓటరు ఐడీ కార్డు నంబర్, పేరు, వయస్సు, తండ్రి పేరు, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం వివరాలన్నీ కనిపిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+