మోగిన తెలంగాణా ఎన్నికల నగారా.. దేనినీ వదలనంటున్న కేసీఆర్ నయా ప్లాన్!!
తెలంగాణ శాసన సభ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 30 న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న జరుగుతుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ డిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ నవంబరు 3 న వెలువడనుంది.
అదే రోజునుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వచ్చే నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 13 వ తేదీవరకు జరుగుతుంది. నవంబరు 15 న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. తెలంగాణతో పాటూ, మిజోరాం, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా CEC షెడ్యూలును ప్రకటించారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో జనాలకు, ముఖ్యంగా యూత్ కు దగ్గరవడం కోసం బీఆర్ఎస్ నయా ప్లాన్ తో ముందుకు వెళుతుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్, ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదు అని నిర్ణయించారు.
ఇందులో భాగంగా డిజిటల్ యాప్ ల ద్వారా ప్రచారంలో దూసుకుపోవాలని ఈ కామర్స్ సైట్లతో పాటు, సోషల్ మీడియాలో అన్నిచోట్ల ప్రచారాన్ని చేయాలని కెసిఆర్ భావిస్తున్నారని సమాచారం. amazon, flipkart, paytm, twitter, youtube, facebook, true caller వంటి వేదికలను ఏమాత్రం మిస్ చేసుకోకుండా విరివిగా వాటిని ఉపయోగించాలని మొబైల్ యూజర్లకు బాగా చేరువయ్యేందుకు ఈ విధానాన్ని అనుసరించాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ప్రతి ఇంట్లోనూ మొబైల్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. మొబైల్ ద్వారా ప్రచారం చేస్తే ఎక్కువగా రీచ్ ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటింటికి ప్రచారానికి వెళ్లడంతో పాటుగా, మొబైల్ లో వివిధ యాప్ల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఈ మేరకు ఢిల్లీలోని కొన్ని ఏజెన్సీ లతో కాంట్రాక్ట్ మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది.

పెయిడ్ ప్రమోషన్లు చేసి మొబైల్ ఓపెన్ చేస్తే చాలు తమ పార్టీ వచ్చేలాగా, తమ పార్టీ అభ్యర్థుల గురించి తెలిసేలాగా కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్ పబ్లిసిటీ ఈ ఎన్నికలలో కీలకంగా మారుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మరి అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల బరిలో ముందు వరుసలో నిలిచిన కేసీఆర్, ప్రచారం విషయంలో దూకుడును కొనసాగించనున్నారు. కొత్త ప్లాన్ తో దూసుకుపోనున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications