వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో సలహదారు, మైనార్టీ సంక్షేమశాఖకు ఎకె ఖాన్ ను సలహదారుడిగా నియామకం

తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమశాఖకు సలహాదారుడిగా మాజీ ఎసిబి డిజి ఎకె ఖాన్ ను నియమించింది. ఎకె ఖాన్ నియామకంతో రాష్ట్ర ప్రభుత్వానికి సలహదారుల సంఖ్య తొమ్మిదికి చేరుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్. : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సలహదారుడిని నియమించింది. రాష్ట్ర మైనార్టీ వేల్పేర్ శాఖకు మాజీ ఎసిబి డిజి ఎకెఖాన్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎస్ పి సింగ్ నియామకంతో పాటు ఎకెఖాన్ ను సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయించింది.

ఇప్పటికే ఎనిమిది మంది సలహదారులు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నారు. ఎకె ఖాన్ నియామకంతో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సలహదారుల సంఖ్య ఎనిమిదికి చేరుకొంది.నీటిపారుదల రంగంలో సలహాదారుడిగా ఆర్ ,. విద్యాసాగర్ రావు, ప్లానింగ్ అండ్ ఎనర్జీ విభాగంలో ఎ,కె. గోయల్ , వేల్పేర్ విభాగంలో రామ లక్ష్మణ్ ను, పాలసీ, ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ లో బి.వి. పాపారావు ను, కల్చరల్, టూరిజం , దేవాదాయ విభాగంలో డాక్టర్ కెవి రమణాచారి. పైనాన్స్ కు జిఆర్ రెడ్డి, అంతరాష్ట్ర సమస్యలపై జి. వివేకానందను ప్రభుత్వం నియమించింది. వీరికితోడుగా ఆదివారం నాడు మైనార్టీ సంక్షేమ శాఖకు సలహదారుడిగా మాజీ ఎసిబి డిజి ఎకెఖాన్ ను ప్రభుత్వం నియమించింది.ఇటీవలనే రిటైరైన్ మాజీ సిఎస్ రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన సలహాదారుడిగా నియమించుకొన్నారు.

telangana governament appoints ak khan as adviser

తెలంగాణ ప్రభుత్వం నాలుగు నుండి 12 శాతం ముస్లింలకు రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించింది. ఈ మేరకు ముస్లింల జీవన స్థితిగతులపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ కూడ రిపోర్టును ఇచ్చింది..మరో వైపు తెలంగాణ ప్రభుత్వం బిసి కమీషన్ ను ఏర్పాటుచేసింది. ఎస్ టి లకు కూడ 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని టిఆర్ఎస్ హమీ ఇచ్చింది.

తమిళనాడు రాష్ట్రంలో 50 శాతం కంటే రిజర్వేషన్లను ఏ తరహలో అమలు చేస్తున్నారనే విషయమై అధ్యయనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఎకె ఖాన్ నేతృత్వంలో అధికారుల బృందం తమిళనాడులో పర్యటించే అవకాశం ఉంది. న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఏ రకంగా అమలుచేస్తున్నారనే విషయమై ఎకె ఖాన్ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేయనుంది.

English summary
telangana governament appointed ak khan as adviser of minority welfare department , taking the number of adviser to nine including former cs rajiv sharma as chief adviser.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X