2024 లో ప్రభుత్వ సాధారణ సెలవులివే - పాఠశాలల క్యాలెండర్ ఇలా..!!

వచ్చే ఏడాది 2024కి సంబంధించిన సెలవులు ఖరారయ్యాయి. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్‌ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా వెల్లడించనున్నారు. 2024 లొ మొత్తం 25 సాధారణ సెలవులను ప్రకటించారు. అదే విధంగా వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు.

సెలవుల జాబితా: 2024 లో ప్రభుత్వ సాధారణ సెలవుల జాబితాను విడుదల చేసారు. వచ్చే ఏడాది భోగి పండుగ ఆదివారం వచ్చింది. జనవరి 14న భోగి పండుగ జరుపుకోనున్నారు. 15 న సంక్రాతి సెలవు ప్రకటించారు. 16న కనుమ, జనవరి 26న రిపబ్లిక్ డే సెలవు ఉండనుంది. మార్చి 3, 2024న మహా శివరాత్రి సెలవు ప్రకటించారు. మార్చి 29న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5న బాబుజగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సెలవుగా ఖరారు చేసారు. ఏప్రిల్ 9న ఉగాది పర్వదినం, ఏప్రిల్ 10న రంజాన్ పండుగ రోజు సెలవుగా నిర్ధారించారు.

Telangana Government Announces Holidays list for the Year 2024, Details here

ఐఛ్చిక సెలవులు: ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సెలవు కాగా, ఏప్రిల్ 17న శ్రీరామ నవమికి సెలవు. జూన్ 17న బక్రీద్, జూలై 17న మొహర్రం, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు సెలవు. ఆగస్టు 26, 2024న శ్రీక్రిష్టాష్ఠమి, సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 16న ఈద్ మిలాదున్ నబీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 11న దుర్గాష్ఠమి, అక్టోబర్ 12న మహర్నవమి, అక్టోబర్ 13న దసరా కాగా ఆ రోజు ఆదివారం వచ్చింది. ఇక, అక్టోబర్ 30న నరకచతుర్ధవి, అక్టోబర్ 31న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్టమస్ సెలవులు ప్రకటించారు. వీటితో పాటుగా 22 ఐఛ్చిక సెలవులను ప్రకటించారు.

పాఠశాలలకు సెలవుల లిస్టు: ఇక.. పాఠశాలల్లో 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి. 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 13 నుంచి 25వ వరకు దసరా సెలవులు ప్రకటించారు. జనవరి 12వ తేదీ నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ఖరారు చేసారు. ఇక, ఒకటి నుంచి తొమ్మది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18వ వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+