విద్యార్థులకు షాక్: భారీగా పెరిగిన ఫీజులు
తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను భారీగా పెంచుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) పంపిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో నంబర్ 10ని విడుదల చేసింది. ఈ పెంపుతో వందలాది విద్యాసంస్థల్లో ఫీజులు సామాన్యులకు భారంగా మారనున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 120 బీఫార్మసీ కళాశాలలు ఉండగా, వాటిలో గతంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెరిగాయి. గరిష్ఠంగా ఒక విద్యార్థి ఏడాదికి రూ. 1.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కేవలం మూడు కాలేజీల్లోనే లక్ష రూపాయల పైచిలుకు ఫీజు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలల్లో ఫీజు రూ. 50 వేల మార్కును దాటగా, కేవలం 17 విద్యాసంస్థల్లో మాత్రమే రూ. 45 వేల నుంచి రూ. 49,500 లోపు ఫీజులు ఉన్నాయి.

ఫార్మా-డీ, బీఆర్క్ ఫీజుల (Fee) వివరాలు..
ఫార్మా-డీ కోర్సు విషయానికొస్తే, గతంలో ఉన్న రూ. 1.25 లక్షల గరిష్ఠ ఫీజు ఇప్పుడు రూ. 1,37,500కి చేరింది. రాష్ట్రంలోని 79 ఫార్మా-డీ కాలేజీల్లో 13 చోట్ల ఫీజు లక్ష రూపాయలకు పైగా ఉంది. ఈ కోర్సులో కనిష్ఠ ఫీజుగా రూ. 68 వేలను ప్రభుత్వం నిర్ణయించింది. అటు బీఆర్క్ (ఆర్కిటెక్చర్) విభాగంలో ఉన్న 8 కళాశాలల్లో అశోకా కళాశాల ఫీజు అత్యధికంగా రూ. 1.32 లక్షలుగా ఖరారైంది.
బీఫార్మసీ..
- గురునానక్ - రూ.1.21 లక్షలు
- CMR - రూ1.10 లక్షలు
- విష్ణు ఇన్‌స్టిట్యూట్ రూ-1.06 లక్షలు
- సుల్తాన్ ఉలూమ్ రూ.1.05 లక్షలు
- పుల్లారెడ్డి -రూ.1.02 లక్షలు
- గీతాంజలి- రూ.1.00 లక్షలు.
- ఎస్.ఎన్.వనితా మహావిద్యాలయ -రూ.లక్ష
ఫార్మా-డీ..
- గీతాంజలి & గురునానక్ -రూ.1.37 లక్షలు
- శ్రీదత్త -రూ.1.26 లక్షలు
- శ్రీ ఇందు,మల్లారెడ్డి, సెయింట్ పీటర్స్, సుల్తాన్ ఉలూమ్ - రూ 1.10 లక్షలు
- ఎస్.ఎన్. వనితా మహావిద్యాలయ, సెయింట్ పాల్స్, తాళ్ల పద్మావతి - రూ.1.08 లక్షలు,
- భరత్ -రూ.1.07 లక్షలు,
- మల్లారెడ్డి ఫార్మసీ- రూ.1,02,600
- సీఎంఆర్ - రూ.లక్ష.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications