రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వాటికి గ్రీన్ సిగ్నల్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. గుడ్ న్యూస్ వినిపించింది. ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు మొదలు పెట్టింది.

వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల్లో గ్రూప్ 1 పోస్టులు భారీ ఎత్తున ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వాటిని దశలవారీగా భర్తీ చేయాలని నిర్ణయించింది. తొలిదశలో 60 పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

Telangana Govt approves the filling of 60 vacant positions under Group 1 services

ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆయా ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసే బాధ్యతను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించింది. వివిధ శాఖలు, విభాగాల్లో తొలిదశలో 60 పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఆర్థికశాఖ పరిధిలో కార్యకలాపాలను నిర్వహించే రాష్ట్ర ఆడిట్ విభాగాధిపతి కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయడానికి అనుమతి లభించింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో 24 డీఎస్పీల పోస్టులను త్వరలో భర్తీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

Telangana Govt approves the filling of 60 vacant positions under Group 1 services

జైళ్ల శాఖలో మూడు డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగంలో మూడు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, పంచాయతీ రాజ్ విభాగంలో 19 ఎంపీడీఓలు, రెండు జిల్లా పంచాయతీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రెవెన్యూ శాఖలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మూడు డిప్యూటీ కలెక్టర్ ఖాళీలు, ఎక్సైజ్ శాఖలో నాలుగు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్, రిజిస్ట్రేషన అండ్ స్టాంప్స్ విభాగంలో ఒక జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+