రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, పెండింగ్ నిధుల జమ..!!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పెండింగ్ నిధుల పై కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా నిధులను వరుసగా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. రైతులకు ఉన్న భూమి ఆధారంగా విడతల వారీగా నిధులను జమ చేస్తున్నారు. వరుసగా నిధుల జమతో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విడత చెప్పినట్లుగానే ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక అంశాన్ని వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.78 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అర్హులైన ప్రతి రైతుకు దశలవారీగా రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడతగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను నేరుగా జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామని అన్నారు.

ప్రతీ సంఘటనలో.. ప్రతీ సంఘర్షణలో - సీఎం రేవంత్ ఎమోషనల్..!!
ప్రతీ సంఘటనలో.. ప్రతీ సంఘర్షణలో - సీఎం రేవంత్ ఎమోషనల్..!!
telangana-govt-credited-fifth-phase-funds-in-farmers-accounts-as-rythu-bharosa-scheme

అయిదో విడత నిధులు విడుదలతో

కాగా, వ్యవసాయం దండగ కాదని, పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. కాగా.. ఈ రోజు మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా, ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పటివరకు మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+