హైదరాబాద్‌కు న్యూయార్క్ లుక్: విశ్వనగరం- రాయదుర్గం వద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్: రియల్టర్ల కోసమా?
T Square in Hyderabad: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటించారు. ట్యాంక్ బండ్ చుట్టూ అతి ఎత్తయిన భవనాల నిర్మాణం, లండన్ థేమ్స్ తరహాలో మూసీ నది అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను ప్రకటించింది గానీ అవేవీ పెద్దగా కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి.
అదే పాట..
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పాటను అందుకుంది. అదే పంథాలో సాగుతోంది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. దీనికి అనుగుణంగా ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం ప్రకటించింది.

టీ- స్వేర్ నిర్మాణం..
హైదరాబాద్ రాయదుర్గం వద్ద టీ- స్క్వేర్‌ను నిర్మించబోతోంది రేవంత్ సర్కార్. దీనికి అవసరమైన చర్యలను సైతం చేపట్టింది. టీ- స్క్వేర్ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్వీకరించింది. ఈ మేరకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది టీజీఎస్ఐఐసీ. క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
న్యూయార్క్ తరహాలో..
అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌లో గల ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ గురించి తెలియనివారుండరు. దాన్ని తలపించేలా ఇది నిర్మితం కాబోతోంది. మన్‌హట్టన్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్మెంట్ హబ్‌గా గుర్తింపు పొందింది. అతి పెద్ద కమర్షియల్ సెంటర్, ఇప్పుడు వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ పాయింట్ కూడా అదే. 1873లో తొలిసారిగా ఇది మనుగడలోకి వచ్చింది. ఒక్కో దశాబ్దంలో ఒక్కో విధంగా అభివృద్ధి చెందింది.
రాయదుర్గం వద్దే ఎందుకంటే..?
రాయదుర్గం పరిసరాల్లో చాలినంత స్థలం ఉండటం దీనికి ఓ కారణం. హైదరాబాద్ సిటీ బస్సులు, మెట్రో రైల్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఇప్పటికే- ఆ ప్రాంతానికి ఐటీ హబ్‌గా గుర్తింపు ఉంది. ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాన్నీ రాయదుర్గం పరిసరాల్లోనే అధికంగా ఉంటోన్నాయి. రాత్రివేళ ఈ ప్రాంతాన్ని చూస్తే.. హైదరాబాద్‌లోనే ఉన్నామా? అనిపిస్తుంది.
రియల్ ఎస్టేట్ కోసమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రకటించడం వెనుక రియల్ ఎస్టేట్ అభివృద్ధి కాన్సెప్ట్ కూడా ఉందని చెబుతున్నారు. టీ- స్క్వేర్ పేరు చెప్పుకొని రాయదుర్గం పరిసరాల్లో రియల్టర్లు ఇక రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. భూముల రేట్లు ఇప్పటికే ఆకాశాన్నింటిన ప్రస్తుత పరిస్థితుల్లో అవి మరింత పెరగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
-
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications