ఆ రోజున తెలంగాణలో సెలవు- ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

Telangana govt declares holiday on November 30

పోలింగ్‌కు నెలన్నర రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాయి. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సోమవారం జనగామ, భువనగిరిల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తోన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదే రోజున వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. జనగర్జన పేరుతో కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో సభలను నిర్వహించింది.

అటు అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలో శరవేగంగా కొనసాగిస్తోంది. పోలింగ్‌ను సజావుగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ వస్తోన్నారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌ల స్టోరేజీలను ను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ మరమ్మత్తులు, ఇతరత్రా పనుల కోసం 19.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

అదే సమయంలో- పోలింగ్‌ రోజయిన నవంబర్‌ 30వ తేదీ నాడు సెలవును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ రోజును ప్రభుత్వ సెలవు ప్రకటించింది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మూతపడనున్నాయి.

ఓట్ల లెక్కింపును చేపట్టే డిసెంబర్ 3వ తేదీ నాడు ఆదివారమే అయినప్పటికీ- దాన్ని కూడా సెలవుగా పరిగణించనుంది ప్రభుత్వం. ఆ రోజున వేతన సెలవుగా గుర్తించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజుకు సంబంధించిన వేతనాన్ని చెల్లిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+