వరంగల్ కు వరమిచ్చిన తెలంగాణా ప్రభుత్వం.. ఆ భారీ ప్రాజెక్టుకు రూ.5257 కోట్లు!

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ కు ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు తాజాగా గ్రేటర్ వరంగల్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు 5257 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

వరంగల్ ప్రజల చిరకాల డిమాండ్ ని తీరుస్తూ ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన వరంగల్ కు ఇది అత్యంత కీలకం అని భావించిన gwmc ప్రజల చిరకాల డిమాండ్ ని తీరుస్తూ నగర రూపురేఖలను మార్చనుంది. వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే, ఒక్క వర్షం పడినా చాలు నగరంలోని అనేక కాలనీలు ముంపుకు గురవుతున్నాయి.

telangana govt good news sanctioned Rs 5257 crore to the gwmc for underground drainage system

తెలంగాణ ప్రభుత్వం 5257 కోట్ల రూపాయల మంజూరు

భూగర్భ కాలువలు సరిగా లేకపోవడం, వర్షపు నీటి నిర్వహణ లేకపోవడం వంటి అనేక కారణాలు నగరం ముంపుకు కారణమవుతున్నాయి. ఇక ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం 5257 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

మూడు దశలలో నిర్మాణ పనుల అమలు

ఈ ప్రాజెక్టుకు జర్మనీ kfw బ్యాంక్ 50% రుణాన్ని అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక 25% నిధులు భరిస్తాయి. మొత్తం 5257 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికే dpr సిద్ధం కాగా, దీని పనులను మూడు దశలలో అమలు చేయాలని భావిస్తున్నారు. భూగర్భ కాలువలు, వర్షపు నీటి నిర్వహణ, వీటి సరఫరా, జలవనరుల పునర్జీవం అంటే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు చేయనున్నారు.

నిధుల మంజూరుతో డిపిఆర్ ఆధారంగా పనులు

ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్, టెలికాం, కేబుల్, ఇంటర్నెట్ వంటి అన్ని సేవలకు భూగర్భ సొరంగాలు నిర్మిస్తారు. నిధుల మంజూరు తో డిపిఆర్ ఆధారంగా పనులను వేగవంతం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో వరంగల్ త్వరలోనే కొత్త రూపు సంతరించుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిధులు మంజూరు చేయటం పట్ల వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+