ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పంపిణీ ముహూర్తం ఫిక్స్ - మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల మంజూరు.. పంపిణీ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు అధికారులకు మార్గదర్శ కాలు ఖరారు చేసింది. హైదరాబాద్ పరిధిలోని లబ్ది దారులకు ఇళ్ల మంజూరు పైన తాజా సమీక్ష లో నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలోని అర్హులందరికీ ఇళ్లను త్వరలోనే ఇస్తామన్నారు. ఈ మేరకు లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధిలోని అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని తాజాగా జరిగిన సమీక్షలో మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ పరిధిలో సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ నెలాఖరులోనే విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

గ్రేటర్ పరిధిలోని అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల మంజూరు పైన మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని ప్రజలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేసారు.
హైదరాబాద్ పరిధిలో లబ్ది దారుల కోసం
ఇక నగరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తిరిగి చేపడతామని, వాటిని వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందించే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగు లేటి వెల్లడించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల నిర్మాణాలకు స్థలాల సేకరణ ప్రక్రియపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌లోని లబ్దిదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించనున్నారు. సిటీకి దూరంగా ఇస్తే వారి జీవనోపాధికి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, హైదరాబాద్ పరిధిలో స్థలాలు ఉన్నవారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. దాదాపు 28 వేల మందికి వీటిని అందించ నున్నట్లు చెప్పారు. ఇక నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయి ఇప్పుడు మళ్లీ మొదలుపెడితే హౌసింగ్ కార్పొరేషన్ సాయం చేస్తుందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications