అంగన్‌వాడీ టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక అంగన్ వాడీ టీచర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు సంతోషం వ్యక్తం చేశారు.

అంగన్ వాడీ టీచర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే హెల్పర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ రూ. 50వేల నుంచి రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో 70వేల మందికి లబ్ధి చేకూరనుంది.












Click it and Unblock the Notifications