అలర్ట్: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష తేదీలు ఖరారు

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఖారారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ మంగళవారం ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఖారారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ మంగళవారం ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. జనవరి 18 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. చివరి మూడు రోజుల్లోనే 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Telangana group-2 exam dates announced by TSPSC

గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడనున్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అంశాలను పరిగణలోకి ఈ మేరకు పరీక్ష తేదీలను ప్రకటించింది.

గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-4 పరీక్ష తేదీలను టీఎస్ పీఎస్సీ ఇప్పటికే ఖరారు చేసిన విషయ తెలిసిందే. జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, జులై 1న గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+