వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ పర్యటన..ఫ్లెక్సీల కలకలం : వైట్ ఛాలెంజ్‌కు సిద్థమా -నైట్ క్లబ్ ఫొటోలతో..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అగ్రనేత మరి కొద్ది గంటల్లో తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం టీపీసీసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖి నిర్వహణ కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓయూలో రాహుల్‌ పర్యటనకు అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అనుమతి విషయంలో ఓయూ అధికారుల నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది.

హైకోర్టు తిరస్కరణతో

హైకోర్టు తిరస్కరణతో

ఈ మేరకు జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి వెకేషన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో..దాదాపుగా ఆ కార్యక్రమం విరమించుకున్నట్లుగానే కనిపిస్తోంది. రాహుల్ గాంధీ వరంగల్ లో పాల్గొనే సభకు పెద్ద ఎత్తున జనసమీకరణకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సభ స్థలిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిని టీపీసీసీ చీఫ్ రాహుల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక, రెండో రోజున షెడ్యూల్ లో భాగంగా ఉస్మానియ యూనివర్సిటీ కార్యక్రమం దాదాపుగా రద్దు అయినట్లుగానే పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

వైట్ ఛాలెంజ్ ఫ్లెక్సీలతో కలకలం

వైట్ ఛాలెంజ్ ఫ్లెక్సీలతో కలకలం

న్యాయస్థానం నుంచి అనుమతి రాకపోవటంతో..ఇతర కార్యక్రమాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇదే సమయంలో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దర్శనమిస్తున్న తాజా ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలానికి కారణమవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్థమా అంటూ ప్లెక్సీలు వెలిశాయి. నగరంలోని ట్యాంక్ బండ్ , గన్ పార్క్ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. వాటి పైన రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం నేపాల్ లోని ఖాట్మండు నైట్ క్లబ్ లో ఉన్నారంటూ బీజేపీ సోషల్ మీడియాలో వీడియోలు..ఫొటోలు షేర్ చేసింది.

రాహుల్ పర్యటన వేళ..ప్రతిష్ఠాత్మకంగా

రాహుల్ పర్యటన వేళ..ప్రతిష్ఠాత్మకంగా


దీని పైన పెద్ద ఎత్తున రాజకీయంగా ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఆ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్దమా అని ప్రశ్నస్తూ దర్శనమిస్తున్నాయి. గతంలో వైట్ ఛాలెంజ్ అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరిగాయి. రాహుల్ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

రేవంత్ సత్తాకు సవాల్ గా టూర్

రేవంత్ సత్తాకు సవాల్ గా టూర్

దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.... మంత్రి కేటీఆర్‌ను వైట్ ఛాలెంజ్‌కు ప్రతి సవాల్ చేసారు. ఇక, రాహుల్ తెలంగాణ పర్యటనకు ముందుగా బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాహుల్ పర్యటన మరుసటి రోజున కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో..ఒక్క సారిగా మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతల వరుస పర్యటనలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇక, వరంగల్ సభలో కేసీఆర్ - బీజేపీ లక్ష్యంగా రాహుల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Amid Rahul tour in Telangana white challenge flexies creating political tension, court rejected petition on seeking permssion for Rahul visit in Osmani University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X