Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరోగ్య తెలంగాణా లక్ష్యంగా తెలంగాణా హెల్త్ ప్రొఫైల్: ప్రారంభించిన మంత్రి హరీష్ రావు; సర్వేతో లాభాలివే!!

తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను చేపట్టాలని నిర్ణయించింది.

ములుగులో తెలంగాణా హెల్త్ ప్రొఫైల్ సర్వేను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ములుగులో తెలంగాణా హెల్త్ ప్రొఫైల్ సర్వేను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం ములుగు జిల్లా ను, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో శనివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి సత్యవతి రాథోడ్ లతో కలిసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ సర్వేను ప్రారంభించారు. అనంతరం ములుగు జిల్లా ఆసుపత్రి భవనానికి, రేడియాలజీ ల్యాబ్ కు, పీడియాట్రిక్ యూనిట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు.

ఇంటింటికీ తెలంగాణా హెల్త్ ప్రొఫైల్.. దీర్ఘకాలిక రోగాలకు చికిత్స

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఓ ఐడి నెంబర్ ఇచ్చి వారి నుంచి నమూనాలను సేకరించి 30 రకాల డయాగ్నొస్టిక్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా వారి ఆరోగ్య సమస్యలను నిర్ధారించి, ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. ఇక ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు.

హెల్త్ ప్రొఫైల్ వైద్య రంగంలో ఒక మైలురాయి

ఇక ఈ తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ వల్ల అనేక ప్రజా ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించడం, వారికి వెంటనే మెరుగైన వైద్య సేవలను అందించడం, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన విధంగా చికిత్స అందించడం చేయనున్నారు. వైద్యరంగంలో ఈ పథకం ఒక మైలురాయిగా వైద్యరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను సమర్థవంతంగా నిర్వహించగలిగితే సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

ఆరోగ్య తెలంగాణాను అవిష్కరించాలన్నదే లక్ష్యం

ఆరోగ్య తెలంగాణాను అవిష్కరించాలన్నదే లక్ష్యం

పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ఈ సర్వే విజయవంతమైతే మిగిలిన జిల్లాలలోనూ హెల్త్ ప్రొఫైల్ చేపడతారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలన్న లక్ష్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.

Recommended Video

    TS : Include COVID-19 Treatment Under Aargoyasri : Seethakka
    40 రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేస్తాం

    40 రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేస్తాం

    40 రోజుల్లో ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని, వివరాలన్నింటినీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని హరీష్ రావు వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ ద్వారా వైద్యులు రోగికి త్వరితగతిన వైద్య సేవలు అందించటానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక ఇదే సమయంలో ములుగులో 42 కోట్ల రూపాయలతో 250 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+