బండి సంజయ్ పాదయాత్ర ఆపాలంటూ సర్కారు వేసిన పిటిషన్ విచారణ వాయిదా

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్‌ పాదయాత్రను ఆపాలంటూ పోలీసులిచ్చిన నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి గురువారం సస్పెండ్ చేసి, ప్రజాసంగ్రామ యాత్రకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం రెండున్నరకు విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Telangana high court adjourned State Govt Appeal to Stop Bandi Sanjay Padayatra

కాగా, బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని ఆగస్టు 23న పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని.. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని ఆరోపించారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ.. హైకోర్టును ఆశ్రయించగా.. బండి సాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది.

పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసును సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. కోర్టు అనుమతితో బండి సంజయ్​ పాదయాత్రను శుక్రవారం తిరిగి ప్రారంభించారు. మొన్న ఆపేసిన ఉప్పుగల్ సమీపంలోని శిబిరం నుంచే యాత్రను తిరిగి ప్రారంభించారు. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు సాగిన పాదయాత్ర నేటితో జనగామ జిల్లాలో పూర్తయింది. ఇప్పుడు హనుమకొండ జిల్లా గర్నేపల్లిలోకి ప్రవేశించింది. హనుమకొండ జిల్లా బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి బండి సంజయ్‌కి ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర కొనసాగించడంపై కోర్టు సోమవారం మరోసారి స్పష్టం చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+