షాక్.. కోదండరామ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్
Prof Kodandaram: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుల ఎంపిక విషయంలో చుక్కెదురైంది. ఎమ్మెల్సీల ఎంపికపై తెలంగాణ హైకోర్టులో ప్రతికూల ఆదేశాలు వెలువడ్డాయి.
తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనమండలికి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కూడా గవర్నర్ కోటా కింద ఎంపిక అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.

దీనిపై ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. వారు ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే మిగిలివుంది. దీనికోసం ఏర్పాట్లు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు.. ఈ నియామకాలను నిలుపుదల చేసింది. యధాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనికి కారణం లేకపోలేదు. కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలు రాజకీయాలతో ముడిపడి ఉన్నవని, గవర్నర్ కోటా కింద నామినేట్ చేయడానికి తగిన అర్హతలు లేవంటూ భారత్ రాష్ట్ర సమితి నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు ఈ ఎంపికను నిలిపివేయాలంటూ అభ్యర్థిస్తూ పిటీషన్లు దాఖలు చేశారు.
ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వాదోపవాదాలను ఆలకించింది. గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను బీఆర్ఎస్.. గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ చేయగా.. అవి తిరస్కారానికి గురైన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కారణంగా గవర్నర్ కోటా కింద శాసన మండలికి ఎంపికకు అనర్హులంటూ రాజ్‌భవన్.. ఆ ప్రతిపాదనలను వెనక్కి పంపించింది.
ఇప్పుడు అదే రాజకీయాలతో ప్రమేయం ఉన్న కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను అదే గవర్నర్ కోటా కింద ఎలా శాసనమండలికి నామినేట్ చేస్తారంటూ దాసోజు శ్రవణ, సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత హైకోర్టు.. వారి ప్రమాణ స్వీకారంపై స్టే జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications