తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల: 6 నుంచి రిజిస్ట్రేషన్లు
Telangana ICET-2023: తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల: 6 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు అర్హత పరీక్ష అయిన టీఎస్ ఐసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది.
మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. జూన్ 20న ఫలితాలు విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 550, మిగితా కేటగిరి విద్యార్థులు రూ. 750 చెల్లించి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రూ. 250 ఫైన్‌తో మే 12 వరకు, రూ. 500 జరిమానాతో మే 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 22 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లుగా ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఐసెట్ ఎగ్జామ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 75 సెంటర్లు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications