తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్, ఏ రోజు ఏ సబ్జెక్ట్ - ఈ సారి కొత్తగా..!!
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. గతం కంటే ఈ సారి పరీక్షలు ముందుగానే జరగనున్నాయి. ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు వెసులు బాటు కల్పించేలా పరీక్షల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగుతాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఈ పరీక్షలు ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు ప్రకటించింది. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25: పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1), ఫిబ్రవరి 27: పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1, మార్చి 02: మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, మార్చి 5: మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1, మార్చి 9: ఫిజిక్స్, ఎకానమిక్స్ -1, మార్చి 03: కెమిస్ట్రీ, కామర్స్..మార్చి 17: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1 జరగనున్నాయి.

అదే విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..ఫిబ్రవరి 26: పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2), ఫిబ్రవరి 28: పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2, మార్చి 03: మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2, మార్చి 6: మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2, మార్చి 10: ఫిజిక్స్, ఎకానమిక్స్ -2, మార్చి 13: కెమిస్ట్రీ, కామర్స్ -2, మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2, మార్చి 18: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1 జరుగుతాయి.
ఇక.. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించేలా బోర్డు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ సెక్టార్ కాలేజీలను ప్రాక్టికల్ సెంటర్లను మినహాయించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే ప్రాక్టికల్స్ షెడ్యూల్ను సిద్ధం చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సుమారు 4.20 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications