Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తే చాలు అడ్రస్ చెప్పేస్తుంది!
Inter Hall Tickets: ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సారి హాల్ టికెట్లపై పరీక్షా కేంద్రం అడ్రస్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉండనుంది. హాల్ టికెట్ పై ఉన్న ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే పరీక్షా కేంద్రం వివరాలు, అడ్రస్ తెలిసిపోతాయి. ప్రతి ఏడాది విద్యార్థులు పరీక్షా సెంటర్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతూ పరీక్షలకు దూరం అవుతుండగా.. ఆ సమస్యలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే.. విద్యార్థులు ఉన్న లొకేషన్ నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరమో.. ట్రాఫిక్ ఎలా ఉందో.. ఎంత సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకోగలరో వంటి వివరాలు తెలుసుకోవచ్చు. వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సులభంగా పరీక్షా కేంద్రాన్ని చేరుకునేందుకు ఇంటర్ బోర్డు ఇలా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది.
అనేక కళాశాలలకు ఒకేలాంటి పేర్లు ఉన్నప్పటికీ సెంటర్ కోడ్ భిన్నంగా ఉండడం వల్ల విద్యార్థులు తరచూ గందరగోళానికి గురవుతారు. అలాంటి వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ తో పాటు ఇంటర్ హాల్ టికెట్ల పై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్), పరీక్షా కేంద్రం, జిల్లా అధికారి, రాష్ట్ర హెల్ప్ లైన్ కాంటాక్ట్ నంబర్లు కూడా ఉంటాయి. వారికి ఫోన్ చేసి కూడా అడ్రస్ తెలుసుకోవచ్చు. ఇంటర్ హాల్ టికెట్ పై ఐవీఆర్ నంబర్ ను మొదటి సారిగా ముద్రిస్తున్నారు. హాల్ డౌన్ లోడింగ్ సహా ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది. పరీక్షా కేంద్రం అడ్రస్.. కాలనీ, ఏ ప్రాంతంలో ఉందో పూర్తి వివరాలు హాల్ టికెట్ పై ఉండనున్నాయి. ఈ ఏడాది 4,88,336 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు, 5,07,956 మంది ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు నమోదు చేసుకున్నారు.

మరో వైపు హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్ ను విద్యార్థి మొబైల్ ఫోన్, తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తారు. విద్యార్థులే సొంతంగా హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరకావచ్చు. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తారు. విద్యార్థులు పరీక్షలకు 10 రోజుల ముందు ఇంటర్ హాల్ టికెట్లను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్చి 6న ప్రారంభం కానున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications