BRS:మా పార్టీపై చంద్రబాబు స్పందన చూశా: KTR

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత కేటీఆర్ ఇటీవలే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బీఆర్ఎస్ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించిన విధానంపై కేటీఆర్ అఫెండ్ అయినట్లు కనిపించింది. చంద్రబాబు స్పందనను చూశామన్నారు. "మా పార్టీ ప్రకటనపై నవ్వారు అంట కదా" అన్నారు.

తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న మహారాష్ట్ర, కర్ణాటక గురించి స్పష్టంగా మాట్లాడారు. పొరుగున ఉన్న ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏపీ రాజకీయాల గురించి ఆయన తొందరెందుకంటూ సమాధానం దాటవేశారు. అక్కడ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, అయినా తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గురించి తెలియనివారుంటారా? అని ఎదురు ప్రశ్నించారు. జాతీయ పార్టీ ప్రకటనకు ఏడెనిమిది నెలలకు ముందే ఇతర పార్టీల నేతలందరితో కేసీఆర్ మాట్లాడారన్నారు.

telangana minister ktr comments on tdp chief chandrababu naidu

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో టీఆర్ఎస్ పై అక్కడి ప్రజలకు అభిమానం ఉందని, టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలకు వారంతా ఆకర్షితులై తమ ప్రాంతాలను తెలంగాణలో కలపమని అక్కడి ప్రభుత్వాలను తెలంగాణ కలపమని అడుగుతున్నారన్నారు. దీన్నిబట్టి కర్ణాటక, మహారాష్ట్రలో పోటీచేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, గుజరాత్ గురించి ఆలోచన చేస్తున్నామని, ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగుతున్నందున సమయం సరిపోతుందా? లేదా? అనేదే సందిగ్ధంగా మారిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+