హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారి టీ-వర్క్స్ : కేటీఆర్, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లియూ ఏమన్నారంటే?

దేశంలో తొలిసారి ప్రొటో టైపింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను మంత్రి కేటీఆర్, ఫాక్స్ కాన్ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ ప్రారంభించారు.

హైదరాబాద్: దేశంలో తొలిసారి ప్రొటో టైపింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఫాక్స్ కాన్ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ గురువారం సాయంత్రం ప్రారంభించారు. వినూత్న ఆవిష్కరణలకు వేదికను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను నగరంలోని రాయదుర్గంలో 18 ఎకరాల విస్తీర్ణంలో 78వేల చదరపు అడుగులలో సకల సదుపాయాలతో నిర్మించారు.

రూ. 100 కోట్లతో టీ వర్క్స్ నిర్మాణం: కేటీఆర్, ప్రత్యేకతలు

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు ఈ టీ వర్క్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్‌లో సుమారు రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టీ హబ్ ఉండగా.. హార్డ్‌వేర్ కు సంబంధించి టీ-వర్క్స్ పనిచేస్తుందని సీఈవో సంజయ్ కారంపురి వ్యాఖ్యానించారు. ప్రొటో టైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్ స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫొబ్రికేషన్, కుండల తయారీ, ప్రీ-కంప్లెయన్స్, మెటల్ షాప్ వంటి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉంచారు.

లక్ష ఉద్యోగాలు: ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌కు కేటీఆర్ ధన్యవాదాలు

లక్ష ఉద్యోగాలు: ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌కు కేటీఆర్ ధన్యవాదాలు

టీ వర్క్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లియూతోపాటు ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ ఎనిమిన్నరేళ్లలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. తాజాగా, ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడులు పెట్టడం, లక్ష మందికి ఉద్యోగ కల్పన చేస్తామని ప్రకటించినందుకు యంగ్ లియూకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌ను షాంజైన్ చేద్దామంటూ ఫాక్స్‌కాన్‌కు కేటీఆర్ పిలుపు

హైదరాబాద్‌ను షాంజైన్ చేద్దామంటూ ఫాక్స్‌కాన్‌కు కేటీఆర్ పిలుపు

తెలంగాణ ఉద్యమ సమయంలో తాము నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి పోరాటం చేశామని.. ఇవాళ ఫాక్స్ కాన్ వంటి సంస్థల పెట్టుబడులతో తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఫాక్స్ కాన్‌తో తెలంగాణ ప్రభుత్వ సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అతిచిన్న దేశమైన తైవాన్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో హైదరాబాద్ ను షాంజైన్ చేద్దామని, ఆ విశ్వాసం తమకుందని ఫాక్స్ కాన్ ప్రతినిధులతో వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో అభివృద్ధి వేగం: ఫాక్స్‌కాన్ ఛైర్మన్

ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లియూ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన టీ వ‌ర్క్స్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయినట్లు తెలిపారు. హైదరాబాద్ తోపాటు తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇదే వేగంతో ప‌ని చేస్తే రాబోయే నాలుగేళ్లలో డ‌బుల్ రెవెన్యూ సాధించడం ఖాయ‌మ‌న్నారు. ఈ ఏడేళ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో సీఎం కేసీఆర్ వివ‌రించారు. టీ వ‌ర్క్స్‌కి ఎస్ఎంటీ యంత్రాన్ని త్వ‌ర‌లోనే అందిస్తామని ఫాక్స్ కాన్ చైర్మ‌న్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+