తెలంగాణ కరోనా లెక్కలివే: ఎన్నికల వేళ.. గ్రేటర్ హైదరాబాద్‌లో స్వల్పంగా పెరుగుదల

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు వెయ్యికి అటు ఇటుగా నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. రోజువారీ కరోనా నిర్ణారణ పరీక్షలు జోరుగా కొనసాగుతోన్నప్పటికీ.. కొత్త కేసులు దానికి అనుగుణంగా నమోదు కాకపోవడం ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి. కరోనా మరణాల సంఖ్య అయిదుకు మించట్లేదు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,058 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 1,440 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,60,834కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,46,7333గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1419కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 12,682గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 10,352 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

 Telangana: Newly 1058 Covid19 positive cases and 4 deaths reported in last 24 hours

గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే.. ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ సంఖ్య 154 168కి పెరిగింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్-4, భద్రాద్రి కొత్తగూడెం-58, జగిత్యాల-36, జనగామ-16, జయశంకర్ భూపాలపల్లి-13, జోగుళాంబ గద్వాల-2, కామారెడ్డి-18, కరీంనగర్-53, ఖమ్మం-36, కొమరంభీమ్ ఆసిఫాబాద్-6, మహబూబ్ నగర్-8, మహబూబాబాద్-9, మంచిర్యాల-37, మెదక్-17, మేడ్చల్ మల్కాజ్‌గిరి-93, ములుగు-15, నాగర్ కర్నూలు-37, నల్లగొండ-43, నారాయణపేట్-7, నిర్మల్-9, నిజామాబాద్-16, పెద్దపల్లి-25, రాజన్న సిరిసిల్ల-30, రంగారెడ్డి-91, సంగారెడ్డి-47, సిద్ధిపేట్-29, సూర్యాపేట్-35, వికారాబాాద్-24, వనపర్తి-15, వరంగల్ రూరల్-9, వరంగల్ అర్బన్-35, యాదాద్రి భువనగిరి-17 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    AP Grama Volunteer Recruitment 2020 Notification & Posts Details | Oneindia Telugu

    తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 38,757 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 50 లక్షల మార్క్‌ను అందుకుంది. 50,11,164 కరోనా నిర్దారణ పరీక్షలను తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఇప్పటిదాకా నిర్వహించారు. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,34,636 మంది శాంపిళ్లను పరీక్షించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+