తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు: ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(PGECET)2023 ఫలితాలు గురువారం(జూన్ 8న) విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎం ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) నిర్వహించిన విషయం తెలిసిందే. మే 29 నుంచి జూన్ 1 వరకు ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో జరిగింది.

జూన్ 30 నుంచి తెలంగాణ సీపీజీఈటీ; 27 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలు(CPGET) 2023-24 విద్యా సంవత్సరానికి జూన్ 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్షలలో అర్హత సాధించడం ద్వారా విద్యార్థులు MA, M Sc, M Com, MCJ, MLib Sc, M Ed, MPEd వంటి వివిధ పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు. ఇక ఉస్మానియాతో సహా కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రాబోయే విద్యా సంవత్సరానికి అందించే పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో కూడా ప్రవేశం పొందవచ్చు.
మేలో ఉస్మానియా విశ్వవిద్యాలయం CPGET కోసం అర్హత డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన లేదా చివరి సెమిస్టర్ (సంవత్సరం) పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ 27 నుంచి తమ హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్ లేదా ఉస్మానియా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 45 సబ్జెక్టుల్లో ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు సెంటర్‌లో రిపోర్టు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications