ఇస్తే గుర్తుండిపోయేలా! వాళ్లలా కాదు కేసీఆర్.. ఇవాంకా కోసం భారీ గిఫ్ట్!
గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన బిల్ క్లింటన్, జార్జ్‌బుష్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. అప్పటి సీఎంలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి..
హైదరాబాద్: ఈనెల 28న భాగ్యనగరంలో ప్రారంభమయ్యే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌ను భారీ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.
గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన బిల్ క్లింటన్, జార్జ్‌బుష్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. అప్పటి సీఎంలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. వారికి హైదరాబాద్ గుర్తుగా చార్మినార్ మెమొంటోను ఇచ్చి సత్కరించారు.

అయితే ప్రస్తుతం భాగ్యనగరానికి రాబోతున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌కు ఇవ్వబోయే గిఫ్ట్ ప్రత్యేకంగా ఉండాలని తెలంగాణ సర్కారు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా.. చార్మినార్ మెమొంటోను మాత్రమే ప్రదానం చేయకుండా.. ఇవాంకాకు ఆమె ఆశ్చర్యపోయేలా ఓ గిఫ్ట్ బాక్స్‌ను అందివ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
హైదరాబాద్ ఐకాన్ అయిన చార్మినార్ మెమొంటోతోపాటు, హైదరాబాద్ స్వర్ణకారులు ప్రత్యేకంగా రూపొందించిన బంగారు నగలను, గద్వాల, సిరిసిల్ల నేతలు రూపొందించిన చేనేత చీరలను గిఫ్ట్ బాక్స్‌లో ఇవాంకాకు అందివ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.
ఇవాంకాకు ఇవ్వబోయే గిఫ్ట్ బాక్స్‌లో ఏయే వస్తువులు ఉండాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఈ గిఫ్ట్ బాక్స్‌ను గోల్కొండ కోటలో 29న జరిగే ప్రత్యేక విందులో ఇవాంకాకు అందించనున్నారట.












Click it and Unblock the Notifications