తెలంగాణాను హెచ్చరిస్తూ మేఘ సందేశం.. ఈ జిల్లాలు జాగ్రత్త!!

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పాటు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఈ జిల్లాలలో నేడు వర్షాలు
ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Telangana rains update moderate rainfall in these districts today issued yellow alert

హైదరాబాద్ లో నేడు వాతావరణం ఇలా
వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రం తర్వాత జల్లుల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్ లో సాయంత్రం వర్షాలకు చాన్స్
నగరంలో కొద్ది రోజులుగా ఉదయం అంతా వాతావరణం పొడిగాను, సాయంత్రం రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. నేడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రం హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని తెలిపింది.

కృష్ణా నదికి కొనసాగుతున్న వరద
ఇదిలా ఉంటే జులై నుంచి కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు కృష్ణ నదికి వరదలు కొనసాగుతూ ఉండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+