హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణ రాష్ట్రంలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో 581 సంక్షేమ వసతి గృహాల అధికారుల ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

మొత్తం 581 పోస్టులకు గాను 574 మందిని ఎంపిక చేసినట్లు TGPSC విడుదల చేసిన ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ నోటిఫికేషన్‌లో తెలిపింది. వీరిలో 561 మంది హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 1, 2, లేడీ సూపర్‌ వైజర్‌ పోస్టులకు ఎంపిక అయ్యారు. 13 మంది వార్డెన్‌, మాట్రన్‌ గ్రేడ్‌ 1, గ్రేడ్‌-2 పోస్టులకు ఎంపిక అయ్యారని టీజీపీఎస్సీ తెలిపింది. ఎంపిక అయిన అభ్యర్థులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్‌, నిబంధనలకు అనుగుణంగా ఎంక్వైరీ సహా తదుపరి ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

Telangana Releases Final Results for Hostel Welfare Officer Exam 574 Candidates Selected

581 సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టులకు గత సంవత్సరం జూన్‌ 24 నుంచి 29 వరకు కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు (CBRT) నిర్వహించిన అధికారులు ఆ తరువాత ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తంగా 1,45,359 మంది దరఖాస్తు చేసుకున్నారు. 82,000 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

ఇక ఈ నెల 10వ తేదీన గ్రూప్ 1, 11న గ్రూప్ 2 ఫలితాలు, 14 గ్రూప్ 3 విడుదల చేసిన టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+