TG సర్పంచ్ ఎలక్షన్స్ : నేటితో మొదటి విడత నామినేషన్ల గడువుకు ఎండ్ !
తెలంగాణలో పల్లె పోరుకు సమయం అసన్నమైంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా నేటితో ( నవంబర్ 29, 2025 ) మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా.. సాయంత్రం 5గంటల వరకు సమయం నిర్దేశించారు. ఒకవేళ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్ధుల నామినేషన్ తిరస్కరణకు గురైతే.. డిసెంబర్1న సాయంత్రం లోపు అప్పీలు చేసుకోవచ్చు. అందుకు గాను సదరు అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారికి అప్పీలు చేసుకోవచ్చు. కాగా డిసెంబర్ 2న అప్పీళ్లను పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉండగా.. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా & గుర్తుల విడుదల జరగనుంది.
మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా.. ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, దాదాపు 37 వేల వార్డులకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు.

అభ్యర్ధికి కావాల్సినవి..
ఎన్నికలో పోటీ చేయాలనుకునే వ్యక్తి గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో ఉండాలి. అలానే అభ్యర్థి తప్పనిసరిగా 21 సంవత్సరాలు దాటివుండాలి. వయసు ధ్రువీకరణకు సంబంధించిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పోటీ చేసేందుకు డిపాజిట్ చెల్లింపునకు సంబంధించిన రశీదు పొందుపరచాలి. జనరల్ కేటగిరీ: రూ. 2,000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ. 1,000 గా ఉంటుంది. నామినేషన్ పత్రం సమర్పించినట్టుగా రిటర్నింగ్ అధికారి నుంచి పొందిన రిసిప్ట్ కూడా ఉండాలి. అభ్యర్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్ అయిన సీట్లలో పోటీ చేస్తే.. ఆయా కేటగిరీలకు చెందినవారుగా పత్రాలు సమర్పించాలి. లాభాపేక్షలేని ప్రభుత్వ లేదా నామినేటెడ్ పోస్టుల్లో ఉండకూడదు
నామినేషన్ తిరస్కరణకు ముఖ్య కారణాలు..
- నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం నామినేషన్ పత్రం లేకపోతే
- నామినేషన్‌లో సంతకాల కోసం కేటాయించిన చోట అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు లేదా ఇద్దరూ సంతకాలు చేయకపోడం
- చట్ట ప్రకారం నిర్దేశిత డిపాజిట్ మొత్తాన్ని చెల్లించకపోతే
- నామినేషన్ పత్రంపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు చేసిన సంతకం సరైనది కాకపోతే తిరస్కరణ కావొచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్ అయిన సీట్లలో పోటీ చేస్తే.. ఆయా కేటగిరీలకు చెందిన పత్రాలు సమర్పించకపోతే
- నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించకపోతే
- ఎస్‌ఈసీ నిర్దేశిత నమూనాలో ఇద్దరు సాక్షుల ధ్రువీకరణలతోపాటు డిక్లరేషన్ పత్రాన్ని అభ్యర్థి సమర్పించకపోతే నామినేషన్లను సంబంధిత అధికారులు తిరస్కరిస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications