విద్యుత్ వినియోగంలో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ: ఈ రోజు ఎంతంటే.?

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది.

గత ఏడాది ఇదేరోజున గరిష్టంగా 12,966 మెగావాట్ల వినియోగం నమోదవడం గమనార్హం. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్-కో అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత అవసరమైనా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెబుతున్నారు.

telangana state all time record in electricity consumption

పెరిగిన సాగు విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాల వల్ల డిమాండ్ కు కారణాలు పేర్కొంటున్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికే 37 శాతం వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు వ్యవసాయానికి 35 శాతం వరకే వినియోగించేవారని పేర్కొన్నారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో విద్యుత్ వినియోగం మరింతగా పెరిగిందని అంటున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పంటలకు నీటి పంపిణీ పెరిగిందని, ఉద్యానవన పంటలకు కూడా నీటి వినియోగం పెరిగిందన్నారు. బోరుబావుల ఆధారంగా సేద్యం చేస్తున్న కారణంగావిద్యుత్ వినియోగం పెరిగిపోయిందన్నారు. డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+